హరి, చరణ్, రమేష్ ,పవన్ , నేను మంచి స్నేహితులం. ఎక్కడికెళ్ళిన కలిసే వెళ్ళేవాళ్ళం. మాలో హరి కి కొంచెం ధైర్యం ఎక్కువ. దేనికీ భయపడడు. రమేష్ కి చాలా భయం. రోడ్ మీద కుక్క కాని, రాత్రి బయటకి వెళ్ళటం కానీ ఇలాంటివి అంటే వాడికి భయం. మిగితా ముగ్గురం మేము అంతలా భయపడం కానీ కొన్ని విషయాల్లో భయం ఉంటుంది. మేమంతా ఒక వారాంతం లో మాకు దగ్గరలో ఉన్న ఒక థీమ్ పార్క్ కి వెళ్దాం అనుకున్నాం. అన్నీ సిద్ధం చేస్కున్నాం. మా మొదటి జీతం తో జల్సా చేద్దామని నిర్ణయించుకుని బయల్దేరాం. అక్కడ చేరుకొని ముందు అక్కడ ఏమున్నాయో కనుక్కుని మేము ఫలానా వాటికి ముందు వెళ్దాం అని నిర్ణయించుకున్నాం. అక్కడ నీటిలో ఎక్కువ ఆడుకునేవే ఉంటాయి. కాబట్టి ముందు మిగితావి చుస్కుంటే చివరిలో అవి చూడచ్చు అని అనుకున్నాం.ఇంతలో అక్కడ ఒక బోర్డు కనిపించింది "హార్రర్ హౌస్ "అని , అటు ఇటు రెండు దయ్యాలు , ఆ బోర్డు మీద రక్తపు మరకలు, ఆ దయ్యాలు మనల్ని స్వాగతిస్తున్నట్టు ఉంది. దీన్ని చుసిన రమేష్ గాడు "ఒరేయ్ మొన్న చంద్రముఖి సినిమా చూసే నాకు నిద్ర పట్టలేదు , ఇంక ఇందులోకి వస్తే ఈసారి నిద్రలోంచి లేవనేమో!!! ", అని ముందే వెనకడుగేసాడు. మాకేమో అందులో ఏముందో చూడాలని!. రమేష్ ఏమో తను రానని, మమ్మల్ని వెళ్ళమని కూర్చున్నాడు. వచిందే అందరం కలిసి ఎంజాయ్ చెయ్యడానికి. ఇంక అందులో ఒకడు రాకుండా ఏంటి అని మేము. ఇంక అందరం కలిసి రమేష్ ని ఒప్పిద్దామని నిశ్చయించుకున్నాం. "ఒరేయ్ బాబు ! అందులో నిజం గా దయ్యాలు ఉండవు రా. ఉత్తి సౌండ్లు మాత్రమే ఉంటాయి. ఉరికే అలా ఒక గుహలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది యవ్వారం. అంతే ", అన్నాడు హరి . "ఔను ! ఔను ఇంక నా 'అంతే' ", అన్నాడు రమేష్. "రేయ్ ! ఇంక రాకపోతే బాగోదు చూడు. వస్తావా చస్తావ ???", అని నేను అడిగా. "చస్తా", అన్నాడు రమేష్. అయితే వచ్చి చావు అని అందరం కోరస్ లో అరిచాం. మొత్తానికి,యుద్ధానికి వెళ్ళే సైనికుడిని సిద్ధం చేసినట్టు వాడిని సిద్ధం చేసాం.
అందరం ధైర్యం గా టికెట్ తీస్కుని లోపలికి వెళ్ళాం. ఐదు మందిని ఒక సారి అందులోకి పంపుతారు. బయట ఒకడు తలుపు ముసేశాడు.లోపల సెవాలు కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. చిమ్మ చీకటి . పక్కనేముందో కూడా కనిపించదు. ఇంక అప్పుడు మొదలయ్యాయి భూత, పిశాచాల హోరు. పెద్దగా భయం అనిపించదు కానీ కొంచెం పిరికి వాళ్ళు ఉంటే వారి పని "అంతే". లోపలికి వెళ్ళిన వాళ్ళల్లో కొంచెం భయం ఉన్నా, మేము దాన్ని బయటపెట్టకుండా ధైర్యం గా ఉన్నట్టు నటించి వెళ్ళాము . లోపల ఎవరిని ముందు పంపాలా అని అందరు ఆలోచిస్తూ నిలబదిపోయాం. బాగా ధైర్యం ఉన్న మా హరి గాడు ముందుకి వెళ్ళగా ఇంక అందరం ఛత్రపతి సినిమా లో ప్రభాస్ వెనక ఉన్న అనుచరులు లాగ వాడి వెనక పడ్డాము.ఒకపక్క పిచి పిచి అరుపులు కేకలు. ఇంకోపక్క హటాత్తుగా కనిపించి ఆరిపోయే దీపాలు. అడుగడుగునా ఏమవుతుందో అన్న భయం, వెనక్కి వేల్లిపోలేని పరిస్తితి. జనాలందరికీ చమటలు పట్టటం మొదలైంది. ఎంత నడిచినా ఇంకా వస్తూనే ఉంది. మధ్యలో ఒక చోట ఎవరైనా నిలబడితే ఒక్కసారిగా పిశాచి వేషం వేసిన ఒక బొమ్మ కటకటాల వెనక నుంచి అరుస్తూ కటకటాలు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంది. అది తెలియని హరి , ముందు ఉన్నందున మాములుగా అటుగా వెళ్ళాడు. ఆ బొమ్మను చూసి కొంచెం బెదిరి అక్కడినించి ముందుకి వెళ్ళాడు. వెనక వాళ్లకి తెలిసిపోయింది కాబట్టి పెద్దగా భయం వెయ్యలేదు.కాని రమేష్ మాత్రం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మా వెనకాల వస్తూ ఉన్నాడు. మధ్యలో హరి గాడు హటాత్తు గా పక్కకు తప్పుకుని చివరినున్న రమేష్ ని భయపెట్టాలని వెళ్ళాడు. దెబ్బకి వాడు అరిచిన అరుపులు , ఆ దయ్యం గోలకంటే గట్టిగ వినిపించాయి మాకు. చివరిలో ఒక దయ్యం వేషం లో ఉన్న బొమ్మ మనకి కనిపిస్తుంది. అది దారి మధ్యలో ఉంటుంది. దాన్ని పక్కకి నెట్టి మనం వెళ్ళాలి. అది దాటితే ఇంక బయటకి వెళ్లిపోవచ్చు.అది బాగా బరువుగా ఉంది. అందుకు ముందున్న హరి, వాడి వెనకున్న నేను కలిసి దాన్ని పక్కకి జరిపి ముందుకు వచ్చేశా౦. వెనకాల ఉన్న చరణ్, పవన్, రమేష్ కుడా మాతో వచ్చేసారు అని అనుకున్నాం. బయటకి వచ్చి, లోపల అలా ఉంది, ఇలా ఉంది అని మాట్లాడుకుంటూ, ఇంక వెల్లిపోతుండగా గుర్తొచ్చింది. మా రమేష్ గాడు కనిపించలేదు. మొత్తం అంతా వెతికాం. ఐనా కనిపించలేదు.ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎత్తడు.ఆ వాసన బాగా నచ్చి అందులోనే ఉండిపోయాడేమో అని అందరం సరదాగా అనుకుని మేమంతా నవ్వుకున్నాం కూడా. కాని నిజంగా నే వాడు అందులో నే ఉండిపోయాడు. కాని వాసన నచ్చి కాదు. వాడికి ఫోన్ చెయ్యగా చెయ్యగా పదోసారి ఎత్తాడు. "నేను రమేష్ కాదు, నాపేరు ఖాన్, ఇమ్రాన్ ఖాన్", అని చెప్పాడు. "ఒరేయ్ చేసిన ఓవర్ చాలు తొరగా రా బే, టైం అయిపోతుంది", అని పవన్ గాడు మాట్లాడాడు."బాబు ఇది మీరనుకున్న రమేష్ ఫోనే , కానీ నేను రమేష్ ని కను ", అని అన్నాడు ఖాన్ . ఈ ఫోన్ వాడికి ఎలా వచ్చింది అని అడిగితే ,ఆ "హార్రర్ హౌస్" లో దొరికిందని చెప్పాడు. ఆ ఖాన్ ఎక్కడున్నాడో కనుక్కుని వాడిని కలిసి ఆ ఫోన్ తీస్కున్నాం. మాకు ఇంక ఖంగారు మొదలైంది. వెంటనే ఆ అధికారి దగ్గరికి వెళ్లి ఇలా జరిగిందని చెప్పాం. వాడేమో తమిళ్ తప్ప ఇంకోటి మాట్లాడడు, మాకేమో తమిళ్ సరిగ్గా రాదు. వచ్చి రాని తమిళ్ లో "అంకుల్, ఫోన్ ఇంగే , నా ఫ్రెండ్ ఎంగె ", అని అడిగాం. వాడికి అర్థం కాలేదు. మాతోనే ఉన్న ఖాన్ కి కొంచెం తమిళ్ వచ్చు. అతను పరిస్తితి ని మొత్తం వివరించాడు. అందరం ఆ అధికారి వెంటే ఆ "హార్రర్ హౌస్" కి వెళ్లి ఆ లోపల వెతికించి,బయటకి తీసారు. మా రమేష్ చెక్కు చెదరకుండా ఉన్నాడు. కాని ఉపిరిమాత్రం తీస్కోట్లేదు.
ఇది ఒక పోలీసు కేసు అయ్యి, ఈ విష్యం పై పోలీసులు దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు. మేము ఎటువంటి కేసు పెట్టలేని పరిస్తితి. ఎందుకంటే ఆ టికెట్ మీద "Heart patients and Pregnant women- enter at their own risk " అని ముందే రాసి ఉంది. మేము అనుకున్నట్టే పోస్ట్ మోర్టం రిపోర్ట్ లో కూడా వాడు మానసిక ఒత్తిడికి గురై చనిపోయాడని తేలింది. రెండు వారల పాటు మాకు నిద్ర లేదు. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ,ఆ విచారణల కోసం పిలుస్తూనే ఉన్నారు.వాడి గురించి బాధ పడి పడి, కొన్నాళ్ళకి మా పరిస్తితి సర్దుమణిగింది. ఇంతలో ఈ కేసు ఉహించని మలుపు తిరిగింది. ఆ రోజు రమేష్ ని బయటకి తీసింది మాత్రమే మాకు తెలుసు. కాని ఆ రోజు రమేష్ తో కాకుండా, ఇంకో రెండు శవాలు పోలీసులు బయటకి తీసారట. ఇది తెలిసిన మాకు ఒకసారి మతిపోయినట్టు అయ్యింది.అంతా ఉలుకు పలుకు లేకుండా ఐపోయం. అంటే మేము వెళ్ళింది నిజంగానే దయ్యాల కొంపలోకా అని అనుకుని, పాపం వాడు రాను రాను అని ఎంతో మొత్తుకున్నాడు, ఐనా సరే లాక్కుని వెళ్ళాం అని అందరం బాధపడ్డాం. పోతే, ఆ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసారు.మేము కేసు పెట్టకుండా అతన్ని ఎందుకు అర్రెస్ట్ చేసారో మాకు అర్థం కాలేదు. ఆ అధికారిని విచారించడం మొదలు పెట్టారు. ఆ అధికారి చెప్పిన ఆధారాల మేరకు, ఆ కొంప లో చివరినున్న ఆ దయ్యం బొమ్మ, బొమ్మ కాదని, అది వాళ్ళు భయపెట్టటానికి ఏర్పాటు చేసిన మనిషి అని చెప్పాడు. పోలీసులు ఆ వ్యక్తిని పిలిచి దర్యాప్తు చెయ్యటాని కుదరలేదు. ఎందుకంటే ఆ మిగితా చేనిపోయిన ఇద్దరి లో వీళ్ళు ఏర్పాటు చేసిన వ్యక్తి ఒకడు......................
అయితే మరి ఈ వ్యక్తిని చంపింది ఎవరు ?? ఆరెండో శవం ఎవరిది ???.......
would be updated soon .