ఈతరం కథలు
Monday, July 26, 2021
Monday, July 10, 2017
వినా సెల్ఫోన్ జీవం నాస్తి - సాంఘిక మాధ్యమ వ్యసనం
ఈ రచనలోని సన్నివేశాలు మిమ్మల్ని ఉద్దేశించి ఉన్నాయనిపిస్తే అది మీలో ఉన్న నిజాయితీ కి నిదర్శనం.
రోజూ జనజీవన స్రవంతి లో చూసే వాటిని మీ ముందుంచే ప్రయత్నమిది.
మనిషి బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు తిండి, ఇల్లు, బట్ట. ఈ ఇరవైఒకటో శతాబ్దం లో, భూమే ఈనిందా అన్నంతగా జనాభా పెరిగిపోతున్న తరుణంలో మనిషి కి ఈ కనీస అవసరాలతో పాటూ అత్యవసరమైనది ఇంకోటి ఉంది. దాని పేరే సెల్ ఫోన్. మనిషి ఊపిరి పీల్చుకోకుండా అయినా బ్రతకగలడేమో కానీ, ఈ పరికరం లేడకుండా క్షణం కూడా బతకలేడు. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు, ఈ తరం జనాలు స్మార్ట్ ఫోన్ తో పుట్టేస్తున్నారు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు కదా. అందుకే జీవితాంతం దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఆధునికత పెరగటం మంచిదే కానీ అది ఎంతవరకు మనిషి ఉన్నతికి ఉపయోగపడుతోంది, ఎంతవరకు మనిషి పతనానికి కారణం అవుతోంది అనేదానిబట్టి ఆధునికత కి విలువ. మనిషి తన మేధోశక్తి వాడి, యంత్రాల్ని కనిపెట్టేది తన పని సునాయాసంగా చేసుకోటానికి, తద్వారా ఆ సమయాన్ని వేరేవాటి కేటాయించుకోవచ్చని. కానీ మనం వాటి బానిసలు అయిపోయి వాటిమీద అవసరానికి మించి ఆధారపడిపోతున్నాం, బానిసలైపోతున్నాం. ఒకప్పుడు ఈ ఫోన్ ని సంభాషణలకు మాత్రమే వాడేవారు. ఇప్పుడు దానికి తప్ప మిగితా అన్నింటికీ ఉపయోగిస్తాం. ఒకప్పుడు కోడి కూత కు లేచే ఊరు పోయి ఎవడి కోడి వాడి పక్కలో ఉంటుంది. అదే ఫోన్ లో అలారం. అయితే తప్పేంటి, మారుతున్న కాలంతో మారే వాటిలో కోడి కూత కి రీప్లేస్మెంట్ ఇప్పటి అలారం కదా అని అనచ్చు. కానీ పూర్వం జనాలు ఇంకాసేపు పడుకోవాలని ఆ కోడి పీక కోసేసి మళ్ళీ పడుకునేవారు కాదు. మనం ఇప్పుడు అదే చేస్తాం. దాన్నే snooze అని పేరు పెట్టాము.
లేచి లేవగానే ఒకప్పుడు అరచేతులు చూసుకునో, లేదా భక్తి ఉన్నవారు దేవుడి పటం చూసి లేచేవారు. ఇప్పుడు లేవగానే సెల్ ఫోన్ కోసం తడుముకుంటాం. రాత్రి నుండీ ఎన్ని మెసేజెస్ వచ్చాయో చూసుకోవాలి కదా. కొందరు పళ్ళు తోముకుంటూ, మరి కొందరు స్నానం చేస్తూ, మరి కొందరు ........ అబ్బా .. ఇక్కడ చెప్పటం కష్టం లేండి ;)
ఆలా ఎక్కడ పడితే అక్కడ , ఎప్పుడు పడితే అప్పుడు దానికి అంటుకుపోయి ఉంటున్నాం. కొంత మందికి ఫోన్ వాడి వాడి బొటన వెలికి బైసెప్స్ వచ్చేసుంటాయి. అంతలా దానికి అంటుకుపోయేలా చేసే యాప్స్ కొన్ని ఉన్నాయ్. అవే facebook & whatsApp. సాధారణంగా ప్రతీ మనిషికి తనగురించి పక్కవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే తపన ఉంటుందని మన్మధుడు సినిమా లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్తాడు. అది మారిపోయి ఈ కాలంలో జనాలకి తాము ఎం చేస్తున్నామో అందరికి చెప్పుకోవటం బాగా అలవాటైపోయింది. అది ఘనకార్యం అయితే పర్లేదు. తుచ్చమైనవి కూడా అందరికి టముకేసుకోటం అలవాటైంది. దగ్గినా, తుమ్మినా, ఆఖరికి భోంచేస్తున్న అవి అందరికి చెప్పాలి. లేకపోతే నిద్రపట్టదు. వీళ్ళు ఒకెత్తయితే, ఇలా ఎవరెవరు ఎం చేస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకొందరు.
ఇంకొంతమందికి ఇడ్లీ తిన్నా ఆస్కార్ వచ్చినంత గొప్ప. అది కూడా పెట్టేస్తారు facebook లో. ఈ మధ్యన సెల్ఫీ అని కుల్ఫీ అని , నా మొహం అని, నా మూతని, ఇలా రకరకాల పేర్లతో కుక్కమూతో పందిముతో పెట్టి ఒక ఫోటో పెడతారు. అంతటితో ఆగక ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఎంతమంది లైక్ కొట్టారు అని, గంటలో 100 లైక్స్ రావాలన్న ధ్యేయం తో ఉంటారు. లైక్స్ రాకపోతే కుంగి కూసించిపోయే జనాలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వీళ్ళు మిగితా వాళ్ళని అడిగిమరీ బావుందనిపించుకుంటారు.
Watching movie with 5 others, Feeling lucky with 2 others, getting engaged with 4 others అని, ఇలా రకరకాలు ఎవడి పిచ్చికి తగ్గట్టు వాడు సభ్యసమాజం లో బహిరంగంగా చెప్పటం వ్యసనం గా మారింది.
ముక్కు మొహం తెలియని వాడితో ఫ్రెండ్ అయిపోయి మన ఫ్రెండ్స్ లిస్ట్ పెరిగింది అని ఆనందపడిపోతున్నారు. దాన్నే చూసుకుని మన ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిందనుకుంటారు. కానీ మన చుట్టూ ఉన్న జనాల్ని పట్టించుకోరు అసలు. పక్కవాళ్లతో నోరువిప్పి మాట్లాడం సరికదా మొహం కూడా చూడం. ఒకవేళ మనం చూసినా, వాడు ఎదో తప్పు చేసినవాడిలాగా ఎప్పుడు తలదించుకునే ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉంటాడు.
ఇంత తీవ్రంగా ఫోన్లు వాడటం వల్ల మంచి మాట దేవుడెరుగు, ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనిషి మెదడు, విన్నదానికంటే చూసిన విషయాలే ఎక్కువ నిక్షిప్తమై ఉంటాయి. అందులోను మంచికన్నా చెడు ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి చూసిన వెంటనే అందులో ఎంతశాతం నిజం ఉంది అనే విచక్షణ కోల్పోయి అలాంటి వార్తలు చూసినవెంటనే ఎవరికీ తోచిన వారి ధోరణిలో స్పందిస్తారు. పైగా పక్కవాడిని ఎత్తి చూపించటం లో, లోపాలు కనిపెట్టటంలో మనకి మనమే సాటి. మనం స్పందించే ముందు అసలు ఏది నిజం, ఏది అబద్దం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా సాంఘిక ప్రసార మాధ్యమంలో స్పందించేటప్పుడు ఇది చాల అవసరం. ఇది లేనప్పుడు మనిషి ముర్ఖంగా మారి సామాజిక బాధ్యత కోల్పోతున్నాడు.
Friday, February 8, 2013
పొరపాటున మాటిచ్చావ్ కదా కృష్ణా ,- "ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే " అని. అప్పటినించి జనమంతా చక్రాల కుర్చీల్లో, కుర్రకారు సైతం కర్రవెత్తు సాయంతో నడుస్తున్నారు.
నీ తల్లికి చెప్పాలా నిన్ను కట్టెయ్యకుండా విడిచిపెట్టమని, నీ తండ్రికి చెప్పనా నిన్ను తట్టలో తీసుకురమ్మని...
రాధతో రాసలీలలు చాలు కృష్ణ, రా.. ! దేశం ద్రౌపదైంది.
నీ తల్లికి చెప్పాలా నిన్ను కట్టెయ్యకుండా విడిచిపెట్టమని, నీ తండ్రికి చెప్పనా నిన్ను తట్టలో తీసుకురమ్మని...
రాధతో రాసలీలలు చాలు కృష్ణ, రా.. ! దేశం ద్రౌపదైంది.
Saturday, November 5, 2011
అ'భయం'
హరి, చరణ్, రమేష్ ,పవన్ , నేను మంచి స్నేహితులం. ఎక్కడికెళ్ళిన కలిసే వెళ్ళేవాళ్ళం. మాలో హరి కి కొంచెం ధైర్యం ఎక్కువ. దేనికీ భయపడడు. రమేష్ కి చాలా భయం. రోడ్ మీద కుక్క కాని, రాత్రి బయటకి వెళ్ళటం కానీ ఇలాంటివి అంటే వాడికి భయం. మిగితా ముగ్గురం మేము అంతలా భయపడం కానీ కొన్ని విషయాల్లో భయం ఉంటుంది. మేమంతా ఒక వారాంతం లో మాకు దగ్గరలో ఉన్న ఒక థీమ్ పార్క్ కి వెళ్దాం అనుకున్నాం. అన్నీ సిద్ధం చేస్కున్నాం. మా మొదటి జీతం తో జల్సా చేద్దామని నిర్ణయించుకుని బయల్దేరాం. అక్కడ చేరుకొని ముందు అక్కడ ఏమున్నాయో కనుక్కుని మేము ఫలానా వాటికి ముందు వెళ్దాం అని నిర్ణయించుకున్నాం. అక్కడ నీటిలో ఎక్కువ ఆడుకునేవే ఉంటాయి. కాబట్టి ముందు మిగితావి చుస్కుంటే చివరిలో అవి చూడచ్చు అని అనుకున్నాం.ఇంతలో అక్కడ ఒక బోర్డు కనిపించింది "హార్రర్ హౌస్ "అని , అటు ఇటు రెండు దయ్యాలు , ఆ బోర్డు మీద రక్తపు మరకలు, ఆ దయ్యాలు మనల్ని స్వాగతిస్తున్నట్టు ఉంది. దీన్ని చుసిన రమేష్ గాడు "ఒరేయ్ మొన్న చంద్రముఖి సినిమా చూసే నాకు నిద్ర పట్టలేదు , ఇంక ఇందులోకి వస్తే ఈసారి నిద్రలోంచి లేవనేమో!!! ", అని ముందే వెనకడుగేసాడు. మాకేమో అందులో ఏముందో చూడాలని!. రమేష్ ఏమో తను రానని, మమ్మల్ని వెళ్ళమని కూర్చున్నాడు. వచిందే అందరం కలిసి ఎంజాయ్ చెయ్యడానికి. ఇంక అందులో ఒకడు రాకుండా ఏంటి అని మేము. ఇంక అందరం కలిసి రమేష్ ని ఒప్పిద్దామని నిశ్చయించుకున్నాం. "ఒరేయ్ బాబు ! అందులో నిజం గా దయ్యాలు ఉండవు రా. ఉత్తి సౌండ్లు మాత్రమే ఉంటాయి. ఉరికే అలా ఒక గుహలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది యవ్వారం. అంతే ", అన్నాడు హరి . "ఔను ! ఔను ఇంక నా 'అంతే' ", అన్నాడు రమేష్. "రేయ్ ! ఇంక రాకపోతే బాగోదు చూడు. వస్తావా చస్తావ ???", అని నేను అడిగా. "చస్తా", అన్నాడు రమేష్. అయితే వచ్చి చావు అని అందరం కోరస్ లో అరిచాం. మొత్తానికి,యుద్ధానికి వెళ్ళే సైనికుడిని సిద్ధం చేసినట్టు వాడిని సిద్ధం చేసాం.
అందరం ధైర్యం గా టికెట్ తీస్కుని లోపలికి వెళ్ళాం. ఐదు మందిని ఒక సారి అందులోకి పంపుతారు. బయట ఒకడు తలుపు ముసేశాడు.లోపల సెవాలు కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. చిమ్మ చీకటి . పక్కనేముందో కూడా కనిపించదు. ఇంక అప్పుడు మొదలయ్యాయి భూత, పిశాచాల హోరు. పెద్దగా భయం అనిపించదు కానీ కొంచెం పిరికి వాళ్ళు ఉంటే వారి పని "అంతే". లోపలికి వెళ్ళిన వాళ్ళల్లో కొంచెం భయం ఉన్నా, మేము దాన్ని బయటపెట్టకుండా ధైర్యం గా ఉన్నట్టు నటించి వెళ్ళాము . లోపల ఎవరిని ముందు పంపాలా అని అందరు ఆలోచిస్తూ నిలబదిపోయాం. బాగా ధైర్యం ఉన్న మా హరి గాడు ముందుకి వెళ్ళగా ఇంక అందరం ఛత్రపతి సినిమా లో ప్రభాస్ వెనక ఉన్న అనుచరులు లాగ వాడి వెనక పడ్డాము.ఒకపక్క పిచి పిచి అరుపులు కేకలు. ఇంకోపక్క హటాత్తుగా కనిపించి ఆరిపోయే దీపాలు. అడుగడుగునా ఏమవుతుందో అన్న భయం, వెనక్కి వేల్లిపోలేని పరిస్తితి. జనాలందరికీ చమటలు పట్టటం మొదలైంది. ఎంత నడిచినా ఇంకా వస్తూనే ఉంది. మధ్యలో ఒక చోట ఎవరైనా నిలబడితే ఒక్కసారిగా పిశాచి వేషం వేసిన ఒక బొమ్మ కటకటాల వెనక నుంచి అరుస్తూ కటకటాలు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంది. అది తెలియని హరి , ముందు ఉన్నందున మాములుగా అటుగా వెళ్ళాడు. ఆ బొమ్మను చూసి కొంచెం బెదిరి అక్కడినించి ముందుకి వెళ్ళాడు. వెనక వాళ్లకి తెలిసిపోయింది కాబట్టి పెద్దగా భయం వెయ్యలేదు.కాని రమేష్ మాత్రం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మా వెనకాల వస్తూ ఉన్నాడు. మధ్యలో హరి గాడు హటాత్తు గా పక్కకు తప్పుకుని చివరినున్న రమేష్ ని భయపెట్టాలని వెళ్ళాడు. దెబ్బకి వాడు అరిచిన అరుపులు , ఆ దయ్యం గోలకంటే గట్టిగ వినిపించాయి మాకు. చివరిలో ఒక దయ్యం వేషం లో ఉన్న బొమ్మ మనకి కనిపిస్తుంది. అది దారి మధ్యలో ఉంటుంది. దాన్ని పక్కకి నెట్టి మనం వెళ్ళాలి. అది దాటితే ఇంక బయటకి వెళ్లిపోవచ్చు.అది బాగా బరువుగా ఉంది. అందుకు ముందున్న హరి, వాడి వెనకున్న నేను కలిసి దాన్ని పక్కకి జరిపి ముందుకు వచ్చేశా౦. వెనకాల ఉన్న చరణ్, పవన్, రమేష్ కుడా మాతో వచ్చేసారు అని అనుకున్నాం. బయటకి వచ్చి, లోపల అలా ఉంది, ఇలా ఉంది అని మాట్లాడుకుంటూ, ఇంక వెల్లిపోతుండగా గుర్తొచ్చింది. మా రమేష్ గాడు కనిపించలేదు. మొత్తం అంతా వెతికాం. ఐనా కనిపించలేదు.ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎత్తడు.ఆ వాసన బాగా నచ్చి అందులోనే ఉండిపోయాడేమో అని అందరం సరదాగా అనుకుని మేమంతా నవ్వుకున్నాం కూడా. కాని నిజంగా నే వాడు అందులో నే ఉండిపోయాడు. కాని వాసన నచ్చి కాదు. వాడికి ఫోన్ చెయ్యగా చెయ్యగా పదోసారి ఎత్తాడు. "నేను రమేష్ కాదు, నాపేరు ఖాన్, ఇమ్రాన్ ఖాన్", అని చెప్పాడు. "ఒరేయ్ చేసిన ఓవర్ చాలు తొరగా రా బే, టైం అయిపోతుంది", అని పవన్ గాడు మాట్లాడాడు."బాబు ఇది మీరనుకున్న రమేష్ ఫోనే , కానీ నేను రమేష్ ని కను ", అని అన్నాడు ఖాన్ . ఈ ఫోన్ వాడికి ఎలా వచ్చింది అని అడిగితే ,ఆ "హార్రర్ హౌస్" లో దొరికిందని చెప్పాడు. ఆ ఖాన్ ఎక్కడున్నాడో కనుక్కుని వాడిని కలిసి ఆ ఫోన్ తీస్కున్నాం. మాకు ఇంక ఖంగారు మొదలైంది. వెంటనే ఆ అధికారి దగ్గరికి వెళ్లి ఇలా జరిగిందని చెప్పాం. వాడేమో తమిళ్ తప్ప ఇంకోటి మాట్లాడడు, మాకేమో తమిళ్ సరిగ్గా రాదు. వచ్చి రాని తమిళ్ లో "అంకుల్, ఫోన్ ఇంగే , నా ఫ్రెండ్ ఎంగె ", అని అడిగాం. వాడికి అర్థం కాలేదు. మాతోనే ఉన్న ఖాన్ కి కొంచెం తమిళ్ వచ్చు. అతను పరిస్తితి ని మొత్తం వివరించాడు. అందరం ఆ అధికారి వెంటే ఆ "హార్రర్ హౌస్" కి వెళ్లి ఆ లోపల వెతికించి,బయటకి తీసారు. మా రమేష్ చెక్కు చెదరకుండా ఉన్నాడు. కాని ఉపిరిమాత్రం తీస్కోట్లేదు.
ఇది ఒక పోలీసు కేసు అయ్యి, ఈ విష్యం పై పోలీసులు దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు. మేము ఎటువంటి కేసు పెట్టలేని పరిస్తితి. ఎందుకంటే ఆ టికెట్ మీద "Heart patients and Pregnant women- enter at their own risk " అని ముందే రాసి ఉంది. మేము అనుకున్నట్టే పోస్ట్ మోర్టం రిపోర్ట్ లో కూడా వాడు మానసిక ఒత్తిడికి గురై చనిపోయాడని తేలింది. రెండు వారల పాటు మాకు నిద్ర లేదు. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ,ఆ విచారణల కోసం పిలుస్తూనే ఉన్నారు.వాడి గురించి బాధ పడి పడి, కొన్నాళ్ళకి మా పరిస్తితి సర్దుమణిగింది. ఇంతలో ఈ కేసు ఉహించని మలుపు తిరిగింది. ఆ రోజు రమేష్ ని బయటకి తీసింది మాత్రమే మాకు తెలుసు. కాని ఆ రోజు రమేష్ తో కాకుండా, ఇంకో రెండు శవాలు పోలీసులు బయటకి తీసారట. ఇది తెలిసిన మాకు ఒకసారి మతిపోయినట్టు అయ్యింది.అంతా ఉలుకు పలుకు లేకుండా ఐపోయం. అంటే మేము వెళ్ళింది నిజంగానే దయ్యాల కొంపలోకా అని అనుకుని, పాపం వాడు రాను రాను అని ఎంతో మొత్తుకున్నాడు, ఐనా సరే లాక్కుని వెళ్ళాం అని అందరం బాధపడ్డాం. పోతే, ఆ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసారు.మేము కేసు పెట్టకుండా అతన్ని ఎందుకు అర్రెస్ట్ చేసారో మాకు అర్థం కాలేదు. ఆ అధికారిని విచారించడం మొదలు పెట్టారు. ఆ అధికారి చెప్పిన ఆధారాల మేరకు, ఆ కొంప లో చివరినున్న ఆ దయ్యం బొమ్మ, బొమ్మ కాదని, అది వాళ్ళు భయపెట్టటానికి ఏర్పాటు చేసిన మనిషి అని చెప్పాడు. పోలీసులు ఆ వ్యక్తిని పిలిచి దర్యాప్తు చెయ్యటాని కుదరలేదు. ఎందుకంటే ఆ మిగితా చేనిపోయిన ఇద్దరి లో వీళ్ళు ఏర్పాటు చేసిన వ్యక్తి ఒకడు......................
అయితే మరి ఈ వ్యక్తిని చంపింది ఎవరు ?? ఆరెండో శవం ఎవరిది ???.......
would be updated soon .
Friday, November 5, 2010
దీపాలు లేని దీపావళి
శుక్రవారం అమావాస్య సాయంత్రం 5:57 అయ్యింది. వెళ్లి మెస్ లో పెట్టిన సమోసా తిని రూమ్ కి వచ్చా. అప్పుడు గుర్తోచింది .... ఓహో ఈరోజు దీపావళి కదా అని. ఆ విషయం తెలిసినా, ఆ రోజు అసలు అలా అనిపించనే లేదు .నాకు తెలిసి దేశం లో ఇలా దీపావళి జరుపుకునే వాడు ఉండడు.ఎం చెయ్యాలో తోచక కాసేపు ఎవరైనా తెలిసినవారు ఉన్నారేమో మాట్లాడుదాం అని GTALK లో login అయ్యా . ఎవరిని అడిగినా "ఇదిగో ఇంకాసేపట్లో టపాకాయలు కాల్చుకోడానికి వెళ్తున్నాం. నేను మా అన్న, మా వదిన..... నా.... ", అంటూ ఇలా ఒకడు చెప్తే , ఇంకొకడు "మాకు కాలేజీ లో టపాకాయలు ఒక లారీ తో తెప్పిస్తారు, సో ఇంక వెళ్ళాలి రా.. బాయ్" అని ఇంకొకడు .. ఇలా రకరకాలు గా చెప్పారు. ఇంకేముంది. అసలే ఉన్నది దిక్కుమాలిన దరిద్రగొట్టు కాలేజీ లో,పైగా సెలవులు అని అందరు వారి స్వగ్రుహములకు పోయిరి. నా పరిస్తితి నీళ్ళలో పెట్టి వెలిగించిన టపాకాయి లా అయ్యింది. సరే లే కొన్ని జీవితాలు అంతే అనుకుని అలా కూర్చున్నా. ఆలోచెనలు ఒద్దోద్దంటున్నాగేట్లు ఎత్తిన డ్యాం లాగా పరవళ్ళు తొక్కుతూ వచ్చేసాయి .
ఒక్కసారి గుర్తొచింది. ఔను !!! నేను దీపావళి చేసుకుని ఆరేల్లైంది కదా అని .అలా జరుపుకోని దీపావళుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నా . నాకు బాగా గుర్తున్నది నేను ఇంటర్ 2nd year లో ఉన్నప్పటిది. ఆరోజు కూడా ఇంతే .. ఇదే పరిస్తితి. కానీ ఇంకా దరిద్రం. లేక లేక ఔటింగ్ ఇచ్చారు. ఏదో కాస్త బయటికి వెళ్తే కల్చుకోవచ్చేమో అని ఒక తింగరి ఆశ. కానీ కుదరలేదు. మా కాలేజీ కి కొంత దూరం లో మెయిన్ రోడ్ ఉంటుంది . అదే బందర్ రోడ్ , విజయవాడ. అక్కడే కెనరా బ్యాంకు ఉంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఏవో చిరుతిళ్ళు తినడానికి వెళ్ళాము. మాములుగా ఔటింగ్ ఇస్తే అంతే చేస్తాం. ఆరోజు కూడా పెద్ద తేడా లేదు. కానీ ఈ వెళ్ళే లోపు అక్కడ ఆ బ్యాంకు స్టాఫ్ అనుకంట,ఒక పెద్ద వాలటపాకాయలు పెట్టి కాల్చాడు. అప్పుడు అదేదో కోటి రూపాయలు వచ్చినట్టో, లేకపోతే AIEEE లో అల్ ఇండియా ఫస్ట్ వచ్చినట్టో ఎదవ ఫీలింగ్ ఒకటి. ఒక సారి అలా అదేదో పాత సినిమా గుర్తోచింది. అందులో రావు గోపాలరావు బీదవాడు. పాపం ఇంట్లో వాడి పిల్లలకి టపాకాయలు కూడా కొనలేని స్థోమత. రోడ్ మీద వెళ్తున్నప్పుడు దారిలో ఎవడో కాలిస్తే తుస్సుమన్న టపాకాయి ని వాడి పిల్లలకి ఇచ్చుకున్దామని చూసి చూడనట్టు జేబులో వేస్కుంటాడు. అది కాస్త దూరం వెళ్ళగానే వాడి షర్టు జేబు లోనే పేలిపోయి షర్టు కాస్త...... ఒక్కసారి మన పరిస్తితి రావు గోపాలరావు పరిస్తితి కంపార్ చేస్కున్నా.అసలు అలా ఎలా అనిపించిందో. మళ్లీ నాకే ఛి ఛి అనిపించి మామూలు వాడినై ముందుకి వెళ్ళాం. తినేసి రూమ్ కి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకుని , ఆ గౌరవనీయులైన దిక్కుమాలిన ప్రిన్సిపాల్ గారిని తిట్టుకుని అలా ఆ రోజు గడిపేసాం.
ముందుకు వెళ్తే ........ సడన్ గా ఫోన్ మోగింది . అమ్మ కాల్ చేసింది. టపాకాయలు కొన్నామని, ఛాలా తక్కువగానే కొన్నామని , కొనాలి కాబట్టి కొన్నామని , ఇలా ఛాలా చెప్పింది. అలా ఇంకా నేను చిన్నప్పుడు టపాకాయలు తెచ్చుకోడానికి చేసిన పనులు వగైరా అన్ని చెప్పింది. దీంతో ఇంక మూడ్ మారిపోయింది. ఫస్ట్ టైం , తొందరగా కాల్ పెట్టేస్తే బాగుండు అని అనిపించింది........
contd......
ఫోన్ పెట్టేసిన తర్వాత మూడ్ మళ్లీ ఆలోచెనల మీదకి వెళ్ళింది.ఇంటర్ కాలేజీ లైఫ్ అంతా ఒక సారి గుర్తోచింది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు చేసుకున్న ఏ జన్మ పాపమో కానీ వాళ్లకి 10th దాటాకా ఒక రెండేళ్ళు దాక కూపస్థ మండూకాల్లా గడపాలని రాసిపెట్టి ఉంటుంది. ఆ సువర్ణ అవకాశాన్ని మనకి అందిస్తున్నవారు విజయవాడ వారి శ్రీ చైతన్య విద్యాసంస్థలు. కాలేజీ లో చేరేటప్పుడు ఒకలా చెప్తారు. అదేదో ఎక్కడ లేని రాజభోగాలన్నీ మనకే అందిస్తున్నట్టు , తల్లి లాంటి శిక్షణ - తండ్రిలాంటి రక్షణ అంటూ వెధవ క్యాప్షన్లు పెట్టి జనాలకు ఎర వేస్తారు. అడుగు పెడితే అంతే.అసలు మేటర్ తెలుస్తుంది. అసలు శిక్షణ విష్యం లో తల్లి తోను , రక్షణ విష్యం లో నాన్న తో ను పోల్చుకోడానికి వాళ్లకి అసలు ఆలోచేన ఎలా వచ్చిందో తెలీదు కానీ అలా మాత్రం మన ఇంట్లో వాళ్ళు చెయ్యరు -చెయ్యలేరు. కొంచెం గా వాళ్ళని వర్ణించాలంటే ----"ఉదయానే చేపల మార్కెట్ లో అమ్ముకునేవాడిలా ఒక గాడిదపు గొంతేస్కుని నిద్ర లేపే ఫ్లోర్ ఇంఛార్జెస్ , క్లాస్సులు జరిగేటప్పుడు కుక్కల్లా క్లాసు బయట ఉండి తొంగి తొంగి చూసే కోఆర్డినేటర్స్, మోటివేషన్ పేరు తో బుర్ర తినేసే వైస్ ప్రిన్సిపాల్ మొదలగు వారెందరో మహానుభావులు.అప్పుడు వాళ్ళని ఏమి అనలేని పరిస్తితి. ఇప్పుడు కనిపిస్తే వాళ్ళ కి దండేసి తలమీద కొబ్బరికాయలు కొట్టి ఋణం తీర్చుకోవాలి."....to be continued..
ఒక్కసారి గుర్తొచింది. ఔను !!! నేను దీపావళి చేసుకుని ఆరేల్లైంది కదా అని .అలా జరుపుకోని దీపావళుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నా . నాకు బాగా గుర్తున్నది నేను ఇంటర్ 2nd year లో ఉన్నప్పటిది. ఆరోజు కూడా ఇంతే .. ఇదే పరిస్తితి. కానీ ఇంకా దరిద్రం. లేక లేక ఔటింగ్ ఇచ్చారు. ఏదో కాస్త బయటికి వెళ్తే కల్చుకోవచ్చేమో అని ఒక తింగరి ఆశ. కానీ కుదరలేదు. మా కాలేజీ కి కొంత దూరం లో మెయిన్ రోడ్ ఉంటుంది . అదే బందర్ రోడ్ , విజయవాడ. అక్కడే కెనరా బ్యాంకు ఉంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఏవో చిరుతిళ్ళు తినడానికి వెళ్ళాము. మాములుగా ఔటింగ్ ఇస్తే అంతే చేస్తాం. ఆరోజు కూడా పెద్ద తేడా లేదు. కానీ ఈ వెళ్ళే లోపు అక్కడ ఆ బ్యాంకు స్టాఫ్ అనుకంట,ఒక పెద్ద వాలటపాకాయలు పెట్టి కాల్చాడు. అప్పుడు అదేదో కోటి రూపాయలు వచ్చినట్టో, లేకపోతే AIEEE లో అల్ ఇండియా ఫస్ట్ వచ్చినట్టో ఎదవ ఫీలింగ్ ఒకటి. ఒక సారి అలా అదేదో పాత సినిమా గుర్తోచింది. అందులో రావు గోపాలరావు బీదవాడు. పాపం ఇంట్లో వాడి పిల్లలకి టపాకాయలు కూడా కొనలేని స్థోమత. రోడ్ మీద వెళ్తున్నప్పుడు దారిలో ఎవడో కాలిస్తే తుస్సుమన్న టపాకాయి ని వాడి పిల్లలకి ఇచ్చుకున్దామని చూసి చూడనట్టు జేబులో వేస్కుంటాడు. అది కాస్త దూరం వెళ్ళగానే వాడి షర్టు జేబు లోనే పేలిపోయి షర్టు కాస్త...... ఒక్కసారి మన పరిస్తితి రావు గోపాలరావు పరిస్తితి కంపార్ చేస్కున్నా.అసలు అలా ఎలా అనిపించిందో. మళ్లీ నాకే ఛి ఛి అనిపించి మామూలు వాడినై ముందుకి వెళ్ళాం. తినేసి రూమ్ కి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకుని , ఆ గౌరవనీయులైన దిక్కుమాలిన ప్రిన్సిపాల్ గారిని తిట్టుకుని అలా ఆ రోజు గడిపేసాం.
contd......
ఫోన్ పెట్టేసిన తర్వాత మూడ్ మళ్లీ ఆలోచెనల మీదకి వెళ్ళింది.ఇంటర్ కాలేజీ లైఫ్ అంతా ఒక సారి గుర్తోచింది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు చేసుకున్న ఏ జన్మ పాపమో కానీ వాళ్లకి 10th దాటాకా ఒక రెండేళ్ళు దాక కూపస్థ మండూకాల్లా గడపాలని రాసిపెట్టి ఉంటుంది. ఆ సువర్ణ అవకాశాన్ని మనకి అందిస్తున్నవారు విజయవాడ వారి శ్రీ చైతన్య విద్యాసంస్థలు. కాలేజీ లో చేరేటప్పుడు ఒకలా చెప్తారు. అదేదో ఎక్కడ లేని రాజభోగాలన్నీ మనకే అందిస్తున్నట్టు , తల్లి లాంటి శిక్షణ - తండ్రిలాంటి రక్షణ అంటూ వెధవ క్యాప్షన్లు పెట్టి జనాలకు ఎర వేస్తారు. అడుగు పెడితే అంతే.అసలు మేటర్ తెలుస్తుంది. అసలు శిక్షణ విష్యం లో తల్లి తోను , రక్షణ విష్యం లో నాన్న తో ను పోల్చుకోడానికి వాళ్లకి అసలు ఆలోచేన ఎలా వచ్చిందో తెలీదు కానీ అలా మాత్రం మన ఇంట్లో వాళ్ళు చెయ్యరు -చెయ్యలేరు. కొంచెం గా వాళ్ళని వర్ణించాలంటే ----"ఉదయానే చేపల మార్కెట్ లో అమ్ముకునేవాడిలా ఒక గాడిదపు గొంతేస్కుని నిద్ర లేపే ఫ్లోర్ ఇంఛార్జెస్ , క్లాస్సులు జరిగేటప్పుడు కుక్కల్లా క్లాసు బయట ఉండి తొంగి తొంగి చూసే కోఆర్డినేటర్స్, మోటివేషన్ పేరు తో బుర్ర తినేసే వైస్ ప్రిన్సిపాల్ మొదలగు వారెందరో మహానుభావులు.అప్పుడు వాళ్ళని ఏమి అనలేని పరిస్తితి. ఇప్పుడు కనిపిస్తే వాళ్ళ కి దండేసి తలమీద కొబ్బరికాయలు కొట్టి ఋణం తీర్చుకోవాలి."....to be continued..
Subscribe to:
Comments (Atom)