Friday, November 5, 2010

దీపాలు లేని దీపావళి

శుక్రవారం అమావాస్య సాయంత్రం 5:57 అయ్యింది. వెళ్లి మెస్ లో పెట్టిన సమోసా తిని రూమ్ కి వచ్చా. అప్పుడు గుర్తోచింది .... ఓహో ఈరోజు దీపావళి కదా అని. ఆ విషయం తెలిసినా, ఆ రోజు అసలు అలా అనిపించనే లేదు .నాకు తెలిసి దేశం లో ఇలా దీపావళి జరుపుకునే వాడు ఉండడు.ఎం చెయ్యాలో తోచక కాసేపు ఎవరైనా తెలిసినవారు ఉన్నారేమో మాట్లాడుదాం అని GTALK లో login అయ్యా . ఎవరిని అడిగినా  "ఇదిగో ఇంకాసేపట్లో టపాకాయలు కాల్చుకోడానికి వెళ్తున్నాం. నేను మా అన్న, మా వదిన..... నా.... ", అంటూ ఇలా ఒకడు చెప్తే , ఇంకొకడు "మాకు కాలేజీ లో టపాకాయలు ఒక లారీ తో తెప్పిస్తారు, సో ఇంక వెళ్ళాలి రా.. బాయ్" అని ఇంకొకడు .. ఇలా రకరకాలు గా చెప్పారు. ఇంకేముంది. అసలే ఉన్నది దిక్కుమాలిన దరిద్రగొట్టు కాలేజీ లో,పైగా సెలవులు అని అందరు వారి స్వగ్రుహములకు పోయిరి. నా పరిస్తితి నీళ్ళలో పెట్టి వెలిగించిన టపాకాయి లా అయ్యింది. సరే లే కొన్ని జీవితాలు అంతే అనుకుని  అలా కూర్చున్నా. ఆలోచెనలు ఒద్దోద్దంటున్నాగేట్లు ఎత్తిన డ్యాం లాగా పరవళ్ళు తొక్కుతూ వచ్చేసాయి .
                                                           ఒక్కసారి గుర్తొచింది. ఔను !!! నేను దీపావళి చేసుకుని  ఆరేల్లైంది కదా అని .అలా జరుపుకోని దీపావళుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నా . నాకు బాగా గుర్తున్నది నేను ఇంటర్ 2nd year లో ఉన్నప్పటిది. ఆరోజు కూడా ఇంతే .. ఇదే పరిస్తితి. కానీ ఇంకా దరిద్రం. లేక లేక ఔటింగ్ ఇచ్చారు. ఏదో కాస్త బయటికి వెళ్తే కల్చుకోవచ్చేమో అని ఒక తింగరి ఆశ. కానీ కుదరలేదు. మా కాలేజీ కి కొంత దూరం లో మెయిన్ రోడ్ ఉంటుంది . అదే బందర్ రోడ్ , విజయవాడ. అక్కడే కెనరా  బ్యాంకు ఉంది. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఏవో చిరుతిళ్ళు  తినడానికి వెళ్ళాము. మాములుగా ఔటింగ్ ఇస్తే అంతే చేస్తాం. ఆరోజు కూడా పెద్ద తేడా లేదు. కానీ ఈ వెళ్ళే లోపు అక్కడ ఆ బ్యాంకు స్టాఫ్ అనుకంట,ఒక పెద్ద వాలటపాకాయలు పెట్టి కాల్చాడు.  అప్పుడు అదేదో కోటి రూపాయలు వచ్చిట్టో, లేకపోతే AIEEE లో  అల్ ఇండియా ఫస్ట్ వచ్చిట్టో ఎదవ ఫీలింగ్ ఒకటి. ఒక సారి అలా అదేదో పాత సినిమా గుర్తోచింది. అందులో రావు గోపాలరావు బీదవాడు. పాపం ఇంట్లో వాడి పిల్లలకి టపాకాయలు కూడా కొనలేని స్థోమత. రోడ్ మీద వెళ్తున్నప్పుడు దారిలో ఎవడో కాలిస్తే తుస్సుమన్న పాకాయి ని వాడి పిల్లలకి ఇచ్చుకున్దామని చూసి చూడనట్టు జేబులో వేస్కుంటాడు. అది కాస్త దూరం వెళ్ళగానే వాడి షర్టు జేబు లోనే పేలిపోయి షర్టు కాస్త......              ఒక్కసారి మన పరిస్తితి రావు గోపాలరావు పరిస్తితి కంపార్ చేస్కున్నా.అసలు అలా ఎలా అనిపించిందో. మళ్లీ నాకే ఛి ఛి అనిపించి మామూలు వాడినై ముందుకి వెళ్ళాం. తినేసి రూమ్ కి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకుని , ఆ గౌరవనీయులైన దిక్కుమాలిన ప్రిన్సిపాల్ గారిని తిట్టుకుని అలా ఆ రోజు గడిపేసాం. 
                                                                             ముందుకు వెళ్తే ........ సడన్ గా ఫోన్ మోగింది . అమ్మ కాల్ చేసింది. టపాకాయలు కొన్నామని, ఛాలా తక్కువగానే కొన్నామని , కొనాలి కాబట్టి కొన్నామని , ఇలా ఛాలా చెప్పింది. అలా ఇంకా నేను చిన్నప్పుడు టపాకాయలు తెచ్చుకోడానికి చేసిన పనులు వగైరా అన్ని చెప్పింది. దీంతో ఇంక మూడ్ మారిపోయింది. ఫస్ట్ టైం , తొందరగా కాల్ పెట్టేస్తే బాగుండు అని అనిపించింది........
contd......
ఫోన్ పెట్టేసిన తర్వాత మూడ్ మళ్లీ ఆలోచెనల మీదకి వెళ్ళింది.ఇంటర్ కాలేజీ లైఫ్ అంతా ఒక సారి గుర్తోచింది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు చేసుకున్న ఏ జన్మ పాపమో కానీ వాళ్లకి 10th దాటాకా ఒక రెండేళ్ళు దాక కూస్థ మండూకాల్లా గడపాలని రాసిపెట్టి ఉంటుంది. ఆ సువర్ణ అవకాశాన్ని మనకి అందిస్తున్నవారు విజయవాడ వారి శ్రీ చైతన్య విద్యాసంస్థలు. కాలేజీ లో చేరేటప్పుడు ఒకలా చెప్తారు. అదేదో ఎక్కడ లేని రాజభోగాలన్నీ మనకే అందిస్తున్నట్టు , తల్లి లాంటి శిక్షణ - తండ్రిలాంటి రక్షణ అంటూ వెధవ క్యాప్షన్లు పెట్టి జనాలకు ఎర వేస్తారు. అడుగు పెడితే అంతే.అసలు మేటర్ తెలుస్తుంది. అసలు శిక్షణ విష్యం లో తల్లి తోను , రక్షణ విష్యం లో నాన్న తో ను పోల్చుకోడానికి వాళ్లకి అసలు ఆలోచేన ఎలా వచ్చిందో తెలీదు కానీ అలా మాత్రం మన ఇంట్లో వాళ్ళు చెయ్యరు -చెయ్యలేరు. కొంచెం గా వాళ్ళని వర్ణించాలంటే ----"ఉదయానే చేపల మార్కెట్ లో అమ్ముకునేవాడిలా ఒక గాడిదపు గొంతేస్కుని నిద్ర లేపే ఫ్లోర్ ఇంఛార్జెస్ , క్లాస్సులు జరిగేటప్పుడు కుక్కల్లా క్లాసు బయట ఉండి తొంగి తొంగి చూసే కోఆర్డినేటర్స్, మోటివేషన్ పేరు తో బుర్ర తినేసే వైస్ ప్రిన్సిపాల్  మొదలగు వారెందరో మహానుభావులు.అప్పుడు వాళ్ళని ఏమి అనలేని పరిస్తితి. ఇప్పుడు కనిపిస్తే వాళ్ళ కి దండేసి తలమీద కొబ్బరికాయలు కొట్టి ఋణం తీర్చుకోవాలి."....to be continued..    

2 comments:

  1. dear vamsi
    paapam intha chinna vayasulo neeku inni kashtaala?
    baaganey navvinchaavu.
    ee saari nenu kooda deepavali celeb miss ayyaanu.so nee baadhani baaga artham chesukogalanu!!

    ReplyDelete